నేడు ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సింగపూర్ షట్లర్ లోహ్ కీన్ యాతో భారత షట్లర్ లక్ష్యసేన్ తలపడనున్నాడు. నేడు తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అదనపు ఈవో ధర్మరెడ్డి స్వాగతం పలికారు. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నేడు, రేపు పలు ఎంఎంటీఎస్…