భారత్‌కు నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరుగనున్నాయి. సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోడీతో పుతిన్ భేటీకానున్నారు. రాత్రి 9.30 గంటలకు పుతిన్ తిరిగి ప్రయాణం కానున్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కేంద్రం దృష్టిసారించి నేడు వ్యాక్సినేషన్…