భారత్‌కు నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరుగనున్నాయి. సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోడీతో పుతిన్ భేటీకానున్నారు. రాత్రి 9.30 గంటలకు పుతిన్ తిరిగి ప్రయాణం కానున్నారు.
శీతాకాల పార్లమెంటు సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కేంద్రం దృష్టిసారించి నేడు వ్యాక్సినేషన్ ప్యానెల్ సమావేశం నిర్వహించనుంది. బూస్టర్ డోస్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో బూస్టర్ డోస్ కోసం ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుంది.
హైదరాబాద్‌లో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,760లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,830లుగా ఉంది. అయితే కిలో వెండి ధర రూ. 65,500లుగా ఉంది.
రీజనల్ లేబర్ కమిషనర్‌తో నేడు సింగరేణి కార్మికుల సంఘాలు సమావేశం కానున్నాయి. తమ డిమాండ్లు, సమ్మె నోటీసుపై సింగరేణి కార్మికులు చర్చించనున్నారు.
నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఓటీఎస్ స్కీమ్‌ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహాల వద్ద టీడీపీ నిరసనలు చేయనుంది.