పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. అంతేకాకుండా బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపైనా ఆసంతృప్తి వ్యక్తం చేసింది.
మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం నాడు తనపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుంటానని అన్నారు.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు మద్ధతుగా రేపు రైతులు పెద్ద సంఖ్యలో సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సౌరం పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Brij Bhushan Singh: రెజ్లర్లు గంగలో తమ మెడల్స్ పారేస్తామని చెబుతూ హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై భారత రెజర్ల సమాఖ్య(WFI) చీఫ్ బ్రిజ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల్ని కొట్టిపారేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ శరణ్ ను పదవి నుంచి తీసేసి, అరెస్ట్ చేయాలని మహిళా రెజ్లర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే తమ మెడల్స్ గంగా నదిలో విసిరేస్తామని మంగళవారం రెజ్లర్లు హరిద్వార్ వెళ్లారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో 'మహిళా సమ్మన్ మహాపంచాయత్'కు పిలుపునిచ్చారు.
దబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై మహిళా రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపనపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం ప్రత్యేక కోర్టుకు తెలిపారు.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫొగాట్, ఇతరులు శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ తాజా నిరసనను కొనసాగించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు కోసం నిరసన తెలిపిన రెజ్లర్ల అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఈరోజు ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను కోరింది. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ మహిళా రెజ్లర్లు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు చేస్తున్న ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. రెజ్లర్లతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ జరిపిన చర్చలు ఫలించకపోవడమే ఇందుకు కారణం. కాగా, ఈ ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మరోసారి స్పందించారు.