వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టును వైట్‌వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇక, టీ-20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి భారత్-వెస్టిండీస్ జట్లు.. అయితే, టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పొట్టి పార్మాట్ సిరీస్‌కు దూరమయ్యారు.. వారి ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలను జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ ప్రకటించింది..
Read Also: India vs West Indies: టీమిండియా క్లీన్ స్వీప్.. విండీస్‌పై చరిత్ర సృష్టించిన రోహిత్ సేన..
ఫిబ్రవరి 9న జరిగిన రెండో వన్డేలక్ష ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు.. ఇక, అక్షర్ తన గాయం నుండి పూర్తిగా కోలుకోలేదు.. ఇటీవలే కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ తెలిపింది. మొత్తంగా వెస్టిండీస్‌తో జరగనున్న టీ-20 సిరీస్‌కు భారత జట్టులో.. రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా చోటు సంపాదించారు.