సొంత గడ్డపై వన్డేసిరీస్‌ను క్లీన్‌స్విప్ చేసింది టీమిండియా… ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన… ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లోనూ ఘన విజయాన్ని నమోదు చేసింది.. 96 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.. దీంతో వెస్టిండీస్‌పై 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది… విండీస్ ముందు 266 పరుగుల టార్గెట్‌ను పెట్టింది.. అయితే, వెస్టిండీస్ చేతులేత్తేసింది.. కేవలం 169 పరుగులు మాత్రమే చేసి వికెట్లు అన్నీ సమర్పించుకుంది.. దీంతో.. 96 పరుగులతో విజయం సాధించింది.. ఇక, వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం మరోవిశేషం.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంది టీమిండియా..
Read Also: EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!
మూడో వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు బౌలర్లు.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ చేరో రెండు వికెట్లు తమఖాతాలో వేసుకున్నారు.. దీంతో.. 266 పరుగుల ఛేదనలో విండీస్ జట్టు ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది.. ఇక, అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 265 పరుగులకు ఆలౌటైంది… శ్రేయాస్ అయ్యర్ (80), రిషబ్ పంత్ (56)తో టీమిండియా ఇన్నింగ్స్‌లో కీలక భూమిక పోషించారు.