India-Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కిలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్‌పై విషాన్ని వెళ్లగక్కుతున్నాయి.
భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి.
West Bengal: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా భావించే టీఎంసీ నేతని దుండగులు గురువారం కాల్చి చంపారు. మాల్దాలో ఈ ఘటన జరిగింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్‌ఖాలీలో ఈరోజు (డిసెంబర్30) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించనున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. కాశ్మీర్, కోల్‌కతా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టు జరిగింది. ఆదివారం అనుమానిత ఉగ్రవాదిని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల డిమాండ్ మేరకు కాశ్మీర్‌లోని నిషేధిత 'తెహ్రీక్-ఎ-ముజాహిదీన్' సంస్థకు చెందిన అనుమానిత సభ్యుడు జావేద్ మున్షీని డిసెంబర్ 31 వరకు ట్రాన్సిట్ రిమాండ్‌కు కోర్టు పంపింది.
Suvendu Adhikari: బీజేపీ నాయకుడు, బెంగాత్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బంగ్లాదేశ్‌కి వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువుల అణిచివేతపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌కి 2 రాఫెల్ విమానాలు సరిపోతాయని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బసిర్హాట్లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఘోజదంగాలో బంగ్లాదేశ్‌లో హిందువులపై మతపరమైన హింసను ఖండిస్తూ నిరసన తెలిపారు.
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగాలో ‘‘బాబ్రీ మసీదు’’ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వివాదానికి తెరలేపారు. ఈ వ్యాఖ్యలపై బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
CBI Rides: సీబీఐ న్యూఢిల్లీ బృందం దేశంలోని అనేక ప్రాంతాలలో దద్దులు చేసింది. ఇందులో భాగంగా.. భువనేశ్వర్ లోని రామమందిరం సమీపంలో ఉన్న బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ లిమిటెడ్‌పై సీబీఐ న్యూఢిల్లీ బృందం ఈరోజు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసింది. ఒడిశాలోని 5 ప్రాంతాలతో సహా భారతదేశంలోని 11 ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు జరిగాయి. భువనేశ్వర్, కటక్, ఛత్రపూర్ లో దాడులు జరగగా.. ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ…
భవిష్యత్తులో టీఎంసీ బాధ్యతలు చేపట్టనున్న మమతా బెనర్జీ వారసులు ఎవరు? ఈ ప్రశ్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పార్టీలో సీనియర్ నేతలు, యువకుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మమతా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.