సంక్రాంతి పండగ వేళ పశ్చిమ బెంగాల్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మాల్డాలో టీఎంసీ నేత, పార్టీ కార్యకర్తపై కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే జిల్లాలో జనవరి 2న టీఎంసీ కౌన్సిలర్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరగడం తీవ్ర సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
మంగళవారం కలియాగంజ్ ప్రాంతంలో రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీఎంసీ నేత, కార్యకర్త హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఇద్దరిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నామని.. ఘటనకు కారణమేంటో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. గాయపడిన వారిలో ఒకరిని టీఎంసీ స్థానిక కమిటీ అధ్యక్షుడు బకుల్ షేక్‌గా గుర్తించినట్లు తెలిపారు. మాల్దాలోని టీఎంసీ కౌన్సిలర్ దులాల్ సర్కార్ జనవరి 2న హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: ICC: రెండోసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన స్టార్ బౌలర్..