RG Kar Verdict: పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం నెలకొంది. ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దీంతో కేసు విచారణ సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని ఇప్పటికే అందజేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ కు మరణ శిక్షను విధించే సాక్ష్యాలను సీబీఐ గురువారం నాడు సీల్దా సెషన్స్ న్యాయస్థానానికి అందించింది. ఈ కేసులో జనవరి 18వ తేదీన కోర్టు తీర్పును వెల్లడించనుంది. అయితే, తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తరపున లాయర్లు వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపారు. దానికి బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే ఇందుకు సాక్ష్యం అని వెల్లడించారు.
Read Also: Minister Narayana: గుడ్‌న్యూస్.. బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..
అయితే, అత్యాచారం- హత్య కేసులో సంజయ్ రాయ్ ఏకైక నిందితుడు.. విచారణ సమయంలో సేకరించిన ఆధారాలతో అతడికి ఉరి శిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. కాగా, నిందితుడు సంజయ్ బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. న్యాయస్థానం విచారణ సమయంలో నిందితుడు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష, లేదంటే జీవిత కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూచించింది. అలాగే, నిందితుడు సంజయ్ రాయ్ నిర్ధిషి అంటూ సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలు వినిపించారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సృష్టించి, అతన్నీ ఇరికించారని కోర్టుకు తెలిపారు. కాగా, సుమారు ఐదు నెలల పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఆధారాల్ని జనవరి 9వ తేదీన న్యాయస్థానానికి అందించింది.. ఈ కేసులో తుది తీర్పు జనవరి 18న కోర్టు వెల్లడించనుంది.