ఓ కామాంధుడు మేకపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అడ్డుకునేందుకు యత్నించిన మేక యజమాని, అతని కుటుంబీకులపై దాడికి దిగాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల్లోని మాల్దాలో చోటు చేసుకుంది. యజమాని కథనం ప్రకారం.. ఓ వ్యక్తి తన మేకను పొలంలో విడిచిపెట్టాడు. ఆ మేక మేత మేస్తుంది. కొంత సేపటి తర్వాత ఆ యజమాని పొలానికి వెళ్లి చూడగా.. ఆ మేక కనుమరుగైంది. దగ్గరున్న పొలాలు, సమీప ప్రాంతంలో గాలించాడు. ఓ మారుమూల పొలంలో మేక అరుపులు వినిపించాయి. వెంటనే అక్కడి వెళ్లి చూశాడు. మేకపై ఓ యువకుడు అత్యాచారం చేయడాన్ని చూసి కంగుతిన్నాడు. అరుస్తూ ఆ యువకుడిని అడ్డుకునేందుకు వెళ్లగా ఆ కామాంధుడు అతడిపై దాడికి దిగాడు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు.
మేకను ఇంటికి తీసుకొచ్చి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ కామాంధుడు ఫుల్లుగా మద్యం తాగి మేక యజమాని, ఆయన కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. స్పందించిన గ్రామస్థులు వెంటనే ఆ యువకుడిని మందలించారు. బాధిత కుటుంబ సభ్యలు స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో నిందితుడు నలుగురిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
READ MORE: MA 2 : అసిస్టెంట్ డైరెక్టర్ కు నయన్ మధ్య గొడవ.. సినిమా క్యాన్సిల్..?