బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా తీరప్రాంతం మొత్తం అతలాకుతలం అయింది. ఒడిశాలోని 9 జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా భద్రక్ జిల్లాపై పడింది. భద్రక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తుండటంతో చెట్లు విరిగి పడుతున్నాయి. ఇక సముద్రంలోని అలలు ఎగసి పడుతున్నాయి. ఇక బాలేశ్వర్‌లోని చాందిపూర్ లో…
బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ యాస్ ఒడిశాతీరం వైపు దూసుకొస్తున్నది. 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ఒడిశాలోని చాంద్‌బలి-దామ్ర పోర్ట్ కు సమీపంలో తీరం దాటనున్నది. ప్రస్తుతం పారాదీప్‌కు 90 కి.మీ, బాలాసోర్‌కు 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు మధ్యాహ్నం వరకు తుఫాన్ తీరం దాటనున్నది. యాస్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 165 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలోని అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ…
రేపు సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడనుంది… భారత్‌లో మాత్రం పాక్షికంగా ఉండబోతోంది.. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుండగా… భారత్‌లో కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితం కానుంది… పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, ఒడిషా తీర ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులలో కనిపిస్తుందని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యాహ్నం…
యాస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‌గా మారుతుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. తుఫాన్ ప్రభావం భారీగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అలర్ట్ అయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఎన్డీఆర్ఎఫ్.. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లోని 14 జిల్లాల పరిధిలో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.. యాస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ఇక, యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. 11…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్ యాస్‌గా మారింది. ఇది ఇప్పుడు తూర్పు మద్య బంగాళాఖాతంలో తీవ్రమైన తుఫాన్‌గా మారింది. 9 కి.మీ వేగంతో కదులుతూ మరింత బలపడుతున్నది. అతి కొద్ది గంటల్లో ఈ యాస్ తుఫాన్ అతి తీవ్రమైన తుఫాన్‌గా మారి బెంగాల్ ఒడిశా తీరాలవైపు దూసుకుపోయో అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. పారాదీప్‌కు 360 కీలోమీటర్లు, డిగాకు 450 కి.మీ దూరంలో ఈ యాస్ తుఫాన్ కేంద్రీకృతమైంది. దీంతో ఒడిశా బెంగాల్‌కు ఆరెంజ్…
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బెంగాల్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో లాక్డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే, లాక్డౌన్ అమలు చేస్తున్నా, కొంత సమయంపాటు సడలింపులు ఇస్తున్నారు. లాక్ డౌన్ సడలించిన సమయంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ఈ లాక్డౌన్ సమయంలో విచిత్రంగా ప్రవర్తిస్తు పోలీసులను ఇబ్బందులు పెడుతున్నారు. బెంగాల్లో లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నా, బెంగాలీ స్వీట్స్…
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పశ్చిమబెంగాల్లో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు.. మంత్రులను, టీఎంసీ నేతలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.. మంత్రి ఫిర్హాద్ హకీంను, ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం మమతా బెనర్జీ.. టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేయడంపై భగ్గుమన్న…
ఎన్నికలు అయిపోగానే.. బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. మమతా బెనర్జీ కేబినెట్ మంత్రిని ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. సిఎం మమతా బెనర్జీ తో సహా టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓటమిని బిజేపి ఓర్చుకోలేక పోతుందని.. అందుకే తమ నేతలను అరెస్ట్ చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హకీంను వెంటనే విడుదల చేయాలని వారు…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు. బెంగాల్ లో రేపటి నుంచి మే 30వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. తాజాగా మే 30 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధిస్తూ శనివారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 3 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా…