మరో కీలక నిర్ణయం తీసుకున్ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో శాసన మండలి లేకపోగా.. కొత్తగా శాసన మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారు.. ఇవాళ శాసన సభ ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది.. అసెంబ్లీకి 265 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా.. 196 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.. అయితే, సీఎం మమత బెనర్జీ ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు.. ఆమె అక్టోబరులోగా.. శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా.. ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు.. దీంతో.. దీదీ సీఎం పోస్టుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది.. దీంతో.. శాసన మండలి ఉంటే ఎమ్మెల్సీగా ఎన్నికై, ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండగా.. ఈ నేపథ్యంలో శాసన మండలి ఏర్పాటుకు శాసన సభ తీర్మానం చేసింది. దీనిపై ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాల్సి ఉంటుంది.. కాగా, 1969లో రద్దయిన శాసన మండలిని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది టీఎంసీ.. ఆ మెరుకు ఇప్పుడు తీర్మానం చేసింది.. ఈ వ్యవహారంలో దీదీపై విమర్శలు వచ్చినా.. కేంద్రం ఎలా స్పందిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా 52 సంవత్సరాల తర్వాత శాసన మండలిని ఏర్పాటు చేయాలని దీదీ భావిస్తున్నా.. అసలే దీదీ వర్సెస్ కేంద్రంగా నడుస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.