మా సీఎస్‌ను పంపేదిలేదు..! తెగేసిచెప్పిన దీదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కార్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బంద్యోపాధ్యాయ్ ని రిలీవ్ చేయలేనని.. కేంద్రానికి పంపించేది లేదంటూ లేఖలో పేర్కొన్నారు.. తమ సీఎస్.. కేంద్రం దగ్గర రిపోర్ట్ చేయాలన్న ఉత్తర్వులను చూసి ఆశ్చర్యపోయానన్న ఆమె.. కేంద్రం ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలను తనను షాక్‌కు గురుచేశాయని.. బెంగాల్ ప్రభుత్వం ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో తన చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. గతంలో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన చట్టపరమైన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని తాము భావిస్తున్నట్లు కూడా లేఖలో రాసుకొచ్చారు దీదీ.. అంతేకాదు.. రాష్ట్రంలో కరోనా సంక్షోభ నిర్వహణను సీఎస్ చూసుకుంటారని కూడా తెలిపారు మమత బెనర్జీ.. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశానికి సీఎం మమతా బెనర్జీ.. హాజరుకాకపోవడంపై సీరియస్ అయిన కేంద్రం.. కొన్ని గంటల వ్యవధిలోనే చీఫ్ సెక్రటరీ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఇవాళ ఉదయం 10 గంటలకు బెంగాల్ సీఎస్ ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ, ఇదే సమయంలో.. ప్రధానికి లేఖ రాశారు దీదీ. ఆ ఆదేశాలు చట్టపరంగా చెల్లవని, ఇవి అసాధారణం, రాజ్యాంగ విరుద్ధమని తన లేఖలో పేర్కొన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!