పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. ధరలకు బుధవారం కళ్లెం పడింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు నేడు మాత్రం బ్రేక్‌లు పడ్డాయి. తులం గోల్డ్ ధరపై రూ.320 తగ్గింది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హర్యానా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ బోల్తా పడింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయగా.. తీరా రిజల్ట్ సమయానికి అంచనాలన్నీ తారుమారయ్యాయి.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి (ఎల్‌ఓసీ) పాకిస్థాన్ వరుస కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు.
తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే విద్యార్థుల కూడా పుస్తకాలు ముందు వేసుకుని చదువుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల ఫీవర్ మొదలు కాబోతుంది.
BRS Expelled Orientation Session: రేపటి నుంచి (నవంబర్ 11) జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ బహిష్కరించనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసారు కేటీఆర్. శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని, మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారన్నారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ…
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది.
గత మూడు రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. వరుసగా బెదిరింపులు రావడంతో అటు విమాన సంస్థలు, ఇటు పోలీసులు పరుగులు పెట్టారు. ఇలా మూడు రోజులు ప్రయాణికులకు తీవ్ర అవస్థలు ఏర్పడ్డాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న (బుధవారం) జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. అయితే వారం మధ్యలో (బుధవారం) పోలింగ్ ఎందుకు పెట్టారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.