Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!
- విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది
- విచారణలో షాకింగ్ విషయాలు!
- పోలీసుల అదుపులో వ్యాపారవేత్త కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడు రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. వరుసగా బెదిరింపులు రావడంతో అటు విమాన సంస్థలు, ఇటు పోలీసులు పరుగులు పెట్టారు. ఇలా మూడు రోజులు ప్రయాణికులకు తీవ్ర అవస్థలు ఏర్పడ్డాయి. గడిచిన మూడు రోజుల్లో మొత్తంగా 19 విమానాలు భద్రతా ముప్పును ఎదుర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో గడిచిన 24 గంటల్లోనే 9 విమానాలకు ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. తనిఖీలు తర్వాత ఇవన్నీ కూడా నకిలీవేనని తేలాయి. అయినా కూడా ఈ ఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముంబై నుంచి బయలుదేరిన విమానాల ఘటనకు సంబంధించి నమోదు చేసిన కేసులో ఓ మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు వెల్లడించారు.
ముంబై విమానానికి బాంబు బెదిరింపు చేసిన ఘటనలో ఒక వ్యాపార వేత్త కుమారుడు(17) ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వాటి మూలాలు ఛత్తీస్‌గఢ్ నుంచి ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టినట్లు కనుగొన్నారు. ఈ కేసులో సదరు వ్యాపారవేత్తకు సమన్లు పంపించిన పోలీసులు.. మైనర్‌ను అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు. అయితే డబ్బుల విషయంలో గొడవ పడిన ఓ స్నేహితుడిని ఇరికించేందుకు ఈ బాలుడు ఇదంతా చేసినట్లుగా సమాచారం. స్నేహితుడి పేరుతో ‘ఎక్స్’లో ఓ ఖాతా సృష్టించి.. పలు విమానాలకు బెదిరింపు పోస్టులు పెట్టాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
విమానాల బెదిరింపు ఘటనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. సంబంధిత దర్యాప్తు సంస్థలు ఆయా కేసులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు. మూడు విమానాలకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడిన ఓ మైనర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారన్నారు. విమానయాన సంస్థలు, ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!