BRS Expelled Orientation Session: రేపటి నుంచి (నవంబర్ 11) జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ బహిష్కరించనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసారు కేటీఆర్. శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని, మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారన్నారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.
Also Read: Music Director Thaman: ఏంటి తమన్ బ్రో.. సింగర్‌ను పుసుక్కున అలా అనేసావ్
గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారని, మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన అన్నారు. మా శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
Also Read: ICC Banned NCL USA: కొరడా ఝుళిపించిన ఐసీసీ.. చిన్న పొరపాటుకు ఆ లీగ్‌పై నిషేధం