పెళ్లంటే ఎంత సంతోషం.. ఉల్లాసం ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే.. అబ్బాయి-అమ్మాయికి ఎన్నో ఊహాలు ఉంటాయి. భార్యాభర్తలు అయ్యాక.. ఎన్నో ప్రణాళికలు.. ఎన్నో కలలు ఉంటాయి. అలాంటిది పెళ్లి కాక ముందే.. ఓ వరుడు చేసిన పనులకు వధువు అసహ్యించుకుని పెళ్లి పీటల మీద నుంచి దిగి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.
పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. వివాహం తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఓ పెళ్లిలో మాత్రం ఈ విధానాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఏకంగా వరుడి సిబిల్ స్కోర్ ను కూడా చెక్ చేశారు. ఇక్కడే వరుడికి షాక్ ఇచ్చారు అమ్మాయి తరపు బంధువులు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఆ పెళ్లిని క్యాన్సి్ల్ చేశారు. ఈ విచిత్ర ఘటన…
అదానీ కుమారుడు జీత్ అదానీ, దివా షా వివాహం ఘనంగా జరిగింది. అతిరథ మహరథుల సమక్షంలో అంతరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు కానీ.. పాకిస్థాన్‌లో ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం బుక్ చేశాడు. ఈ విమానం వధువు ఇంటిపై డబ్బు వర్షం కురిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎగతాలి చేస్తున్నారు.
Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు అవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు.
యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్‌పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.
హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (60) లేటు వయసులో మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు. క్రిస్మస్ రోజున వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.