Viral News: ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మామ.. పెళ్లి కూతురు ఇంటిపై విమానం నుంచి డబ్బుల వర్షం(వీడియో)
- పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు
- ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు ఆకర్శించింది
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు కానీ.. పాకిస్థాన్‌లో ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం బుక్ చేశాడు. ఈ విమానం వధువు ఇంటిపై డబ్బు వర్షం కురిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎగతాలి చేస్తున్నారు.
READ MORE: Kakinada: కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ఈ వీడియో పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ నగరానికి చెందినది. ఈ వీడియోను ఓ సోషల్ మీడియా వినియోగాదారు షేర్ చేశాడు. దీనిపై ఉర్దూలో సమాచారం అందించాడు. వధువు తండ్రి ఇది కోరినట్లు అందులో రాసి ఉంది. దీని తరువాత, వరుడి తండ్రి అద్దెకు విమానం తీసుకొని వధువు ఇంటిపై కోటి రూపాయల నోట్ల వర్షం కురిపించాడు. ఇది డబ్బు వృథా అని కొందరు విమర్శించారు. అదే సమయంలో కొందరు హేళన కూడా చేశారు. ఇప్పుడు వరుడు తన జీవితంలో తండ్రి తీసుకున్న రుణం తీర్చుకోవలసి ఉంటుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేశారు. “పాకిస్థాన్ ఎందుకు అప్పుల్లో కూరుకుపోయిందో ఇప్పుడు తెలిసింది.” అని ఓ వ్యక్తి కామెంట్ రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
READ MORE: Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం
ఇదిలా ఉండగా… పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది. దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు ఇటీవల 1.5 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం తీసుకున్న అనంతరం దేశంలో ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రపంచానికి దేశ పరిస్థితిని చూపించేందుకు పాకిస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి ఏడు బిలియన్ యూఎస్ డాలర్ల రుణం తీసుకుంది.
دلہن کے ابو کی فرماٸش۔۔۔😛
دولہے کے باپ نے بیٹے کی شادی پر کراٸے کا جہاز لےکر دلہن کے گھر کے اوپر سے کروڑوں روپے نچھاور کر دیٸےاب لگتا ہے دُولھا ساری زندگی باپ کا قرضہ ہی اتارتا رہیگا pic.twitter.com/9PqKUNhv6F
— 𝔸𝕞𝕒𝕝𝕢𝕒 (@amalqa_) December 24, 2024
తాజావార్తలు
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!