Jeet Adani Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన జీత్, దివా షా.. ఫొటోలు వైరల్
- మూడు ముళ్లతో ఒక్కటైన జీత్, దివా షా
- ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్న అదానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ కుమారుడు జీత్ అదానీ, దివా షా వివాహం ఘనంగా జరిగింది. అతిరథ మహరథుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్ అనే అదానీ టౌన్‌షిప్‌లో గుజరాతీ సంస్కృతి ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. జీత్ అదానీ… వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాను వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలను గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Relationships: తియ్యగా ఉన్నాయని ఇలాంటి వాళ్ల మాటలు వింటున్నారా? మొదటికే మోసం
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
‘‘సర్వశక్తిమంతుడైన దేవుని ఆశీర్వాదంతో జీత్ మరియు దివా ఈరోజు వివాహం అనే పవిత్రమైన బంధంతో ఒక్కటయ్యారు. అహ్మదాబాద్‌లో సాంప్రదాయ ఆచారాలు మరియు శుభ్ మంగళ్ భావ్‌తో ప్రియమైనవారి మధ్య వివాహం జరిగింది. ఇది చాలా ప్రైవేట్ కార్యక్రమం. కాబట్టి మేము శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయాము. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నా కుమార్తె దివా మరియు జీత్ కోసం మీ అందరి నుంచి నేను హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటున్నాను.’’ అని పారిశ్రామికవేత్త అదానీ ఎక్స్ ట్విట్టర్ పోస్ట్‌లో రాశారు.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య కలకలం..
గౌతమ్ అదానీ రూ. 10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు. వివిధ సామాజిక కార్యక్రమాలకు ఇస్తున్నట్లు కుమారుడి వివాహం సందర్భంగా అదానీ ప్రకటన చేశారు. విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు ఉపయోగించినట్లు పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం 500 మంది వికలాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని కొత్త జంట కూడా ఇటీవల ప్రతిజ్ఞ చేసింది. వివాహానికి కొన్ని రోజుల ముందు జీత్ అదానీ ఈ చొరవ తీసుకున్నారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు. జీత్ అదానీ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో చదివారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం జీత్.. విమానాశ్రయాల వ్యాపారం, అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
— Gautam Adani (@gautam_adani) February 7, 2025
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!