నిన్నటి తుఫాను యాస్ తీవ్రమై నిన్న రాత్రి తీవ్ర తుఫాను ‘YAAS'(యాస్)గా మారింది. ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు పశ్చిమ & పరిసరాల్లోనే ఉన్న తూర్పుమధ్య & ఉత్తర బంగళాఖాతంలో కొనసాగుతూ, పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిమి దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ, మరింత బలపడి, వాయువ్య బంగా ళాఖాతాములో పశ్చిమ బెంగాల్ కి & ఉత్తర ఒడిశా తీరాలకు చాంద్ బలి – ధర్మా పోర్ట్ లకు దగ్గరగా 26 వ తేదీ తెల్లవారుజామున చేరుకుంటుంది. ఇది మే 26 సుమారుగా మధ్యాహ్నం ఉత్తర ఒడిశా & పశ్చిమ బెంగాల్ తీరాలను, పరదీప్ – సాగర్ ఐలాండ్ ల దగ్గరగా ధర్మా పోర్ట్ కి ఉత్తరంగా దక్షిణ బలాసోర్ కి దగ్గరగా అతితీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఈ రోజు బలమైన కింది స్థాయి గాలులు వాయువ్య, ఉత్తర దిశల నుండి తెలంగాణా మీదకి వీస్తున్నాయి. రాగల 3 రోజులు (25,26,27వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణహెచ్చరికలు:-
ఈ రోజు,ఎల్లుండి (25,27వ తేదీలు) ఉరుములు, మెరుపులుతో (ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణా జిల్లాలలో) కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.