గతేడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయు నాణ్యత పెరిగినట్లు ఎన్విరాన్‌మెంట్ రీసెర్చి జర్నల్ తాజా అధ్యయనంలో తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలపై పరిశోధనలు చేశారు. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య లాక్‌డౌన్ సమయంలో పరిస్థితులను విశ్లేషించారు. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా భూ, వాయుమార్గాల్లో రవాణా గణనీయంగా తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వాతావరణం బాగా మెరుగైనట్లు అధ్యయనం వెల్లడించింది. వాతావరణ కాలుష్యం వంటివాటిలో మార్పులను అధ్యయనం చేసిన పరిశోధకులు.. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఐదేళ్లలో పోలిస్తే బాగా తగ్గాయని వెల్లడించారు.