Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. మార్చి నుంచే వడగాడ్పులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Alert: ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండనున్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే నెల వరకూ మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయి.
Read Also: IIPE: పెట్రోలియం యూనివర్శిటీ నిర్మాణానికి నేడు భూమి పూజ
Also Read
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. మార్చి నుంచి మే వరకూ దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. దీంతోపాటు వడగాడ్పులు వీచే రోజుల సంఖ్యా ఎక్కువ కానున్నాయి. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమై ఆగస్టు నాటికి లానినా మొదలవుతుందని ఐఎండీ అంచనా. నైరుతి రుతుపవనాల సీజన్ రెండో భాగం అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిఫుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!