బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా తుమ్మికపల్లి లలో 42°C, శ్రీకాకుళం జిల్లా కొవిలం లో 41.8°C, నంద్యాల జిల్లాలోని గోస్పాడులో 41.7°C, అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లిలో 41.5°C, పార్వతీపురంమన్యం జిల్లా నవగాంలో 41.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.2°C అధిక ఉష్ణోగ్రతలు వరుసగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని 63 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
Also Read: Sobhita: అబ్బా.. ఏమి అందం..హాలివుడ్ లెవలే..
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని.. అందులో ముఖ్యంగా., వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారుడు హెచ్చరికలు తెలుపుతున్నారు. ముఖ్యంగా వారు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS ), కొబ్బరి నీళ్లు, ఇంట్లో తయారుచేసుకొనే లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ లాంటివి త్రాగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
Also Read: Sobhita: అబ్బా.. ఏమి అందం..హాలివుడ్ లెవలే..
ఇకపోతే గురువారం నాడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు చూస్తే శ్రీకాకుళంలో 8 మండలాలు, మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాలు, విజయనగరం జిల్లా సంతకవిటి మండలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే డగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు చూస్తే.. శ్రీకాకుళంలో 17 , విజయనగరం 24, పార్వతీపురంమన్యం 11, అల్లూరిసీతారామరాజు 8, విశాఖపట్నం 3, అనకాపల్లి 16, కాకినాడ 9, కోనసీమ 8, తూర్పుగోదావరి 19, పశ్చిమగోదావరి 3, ఏలూరు 7, ఎన్టీఆర్ 2, గుంటూరు 1, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు
https://apsdma.ap.gov.in/files/3307593fb8e3163da4fa792fca5943a0.pdf లో తెలుసుకోవచ్చు.