దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది.. అయితే, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట.. దీనికోసం క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుండగా.. ఒక్కొక్కటి వేర్వేరు రోజుల్లో, విమానాలు మేఘాలలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు పనిచేస్తాయని ఓ అధికారి తెలిపారు.
Flights Diversion : కృష్ణా జిల్లాను పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) వద్ద కూడా భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పొగమంచు కారణంగా క్లియరెన్స్ లేక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పలు విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా సుమారు గంట నుంచి ఫ్లైట్స్ గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల…