ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.