పల్నాడు ప్రాంతం పర్యాటకులతో పోటు ఎత్తుతుంది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ద్వారా దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వదలడంతో.. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. గడిచిన కొద్దీ రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు హాజరవుతున్నారు. నేడు ఆదివారం కావడంతో హైదరాబాద్ నుండి కూడా.. పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జునసాగర్ సమీపంలోని సుందర జలపాతాలను సందర్శిస్తున్నారు.
మయన్మార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి మరణించింది. 14 ఏళ్ల బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య చిక్కుకుపోయి ప్రాణాలు వదిలింది. తనను తాను రక్షించుకొనే ప్రయత్నం చేసినా చివరికి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
కిర్గిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి ఆంధ్రాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి దాసరి చందు (21) చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్‌గా తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు అడవుల్లో ఉండే ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి 84 మంది పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. పర్యాటకులు తిరిగి వస్తుండగా ఒక్కసారిగా దారిలో ఉన్న వాగు పొంగింది. దీంతో వాగు దాటలేక అడవిలోనే ఉండిపోయారు పర్యాటకులు. వారిని కాపాడేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు.
సబితం జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి జలపాతం సందర్శనకు వచ్చారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడకు రామ్ కిషన్ బిజ్జు లోబడే (23 ) తన మిత్రులతో కలిసి చింతల మధుర జలపాతంలో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం మేరకు తిర్యాణి ఎస్సై రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో…