సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడకు రామ్ కిషన్ బిజ్జు లోబడే (23 ) తన మిత్రులతో కలిసి చింతల మధుర జలపాతంలో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం మేరకు తిర్యాణి ఎస్సై రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేసి తిరిగి రేపు ఉదయం గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినున్నట్లు తెలిపారు.