First Water School in Hyderabad: జలక్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వాటర్ స్కూల్‌ని హైదరాబాద్‌లో నిన్న ప్రారంభించింది. ఈ ఎక్స్‌క్లూజివ్ స్కూల్‌ని మాదాపూర్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మునిసిపల్ వ్యవహారాలు-పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆరంభించారు. సెయిలింగ్, కయాకింగ్, విండ్ సర్ఫింగ్, స్టాండప్ ప్యాడ్లింగ్‌తోపాటు ఇతర జల అనుబంధ క్రీడలను ఇక్కడ నేర్పిస్తారు.