కృష్ణా బోర్డు సమావేశాన్ని తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి పై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభి ప్రాయాలు వచ్చినట్లు సమాచారాం అందుతోంది. కెఆర్ఎంబి సమావేశంలో జలాల పంపిణీ పై ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికారుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. 50; 50 అంటూ తెలంగాణ పట్టు పట్టగా… 70; 30 కావాలని ఏపీ ప్రభుత్వం తమ వాదనను వినిపించింది. సాగు, తాగునీటి అవసరం ఉన్నపుడు…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతుండడంతో ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. మరోవైపు ఇటీవల సమావేశాలకు హాజరుకాని తెలంగాణ… సెప్టెంబర్ 1న జరిగే KRMB మీటింగ్‌కు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ సమావేశానికి వెళ్లనున్నారు. న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల్లో ఒక్క బొట్టుకూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో…
తిరుపతి : ప్రస్తుతం జన ఆశీర్వాద యాత్రలో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదం పై సామరస్యంగా పరిష్కరిస్తామని… అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని కోరారు. రెండు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి జగన్, కేసిఆర్ లతో మాట్లాడుతానని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా టూరిజం రంగం తీవ్రంగా నష్టపోయిందని..టూరిజం రంగానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తామని తెలిపారు.టూరిజం రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని.. దేఖో అప్ కా…
కేఆర్ఎంబి అధికారుల వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదం అయ్యింది. ప్రాజెక్టుల పనుల పరిశీలన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై తెలంగాణ ఇరిగేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాలా ఆలస్యంగా కేఆర్‌ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కేఆర్ఎంబి చైర్మన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. తాము ఫిర్యాదు దారులమైనందున తమ ప్రతినిధులను కూడా బృందం…
జల వివాదంలో తెలుగు రాష్ట్రాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, కేసులు.. ఇలా ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నాం… అన్నదమ్ముల్లా ఉండాలని మా కోరిక… తగవు పడాలనే ఆలోచనే మాకు లేదన్నారు బొత్స.. ఆంధ్ర ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇది వరకు చెప్పారని గుర్తుచేసిన ఆయన.. అలా అన్నారో లేదో ఆయనే చెప్పాలన్నారు.. ఇక,…
కేఆర్‌ఎంబీకీ ఆంధ్ర ప్రదేశ్ జలవనరులశాఖ మరోసారి లేఖ రాసింది. కృష్ణా బేసిన్ లోని రిజర్వాయర్ లలో నీటి మట్టం పెరుగుతోందని తెలిపింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోందని తెలిపింది. శ్రీశైలం లో నీటి మట్టం 870 అడుగులకు చేరిందని లేఖలో వెల్లడించింది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో జలవిద్యుత్ ఉత్పాదనకు అనుమతివ్వాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటి మట్టం పెరిగితే జల విద్యుత్ ఉత్పాదన చేసే…
తెలంగాణ సర్కార్.. కేంద్రంతో ఘర్షణ కోరుకోవడం లేదా? జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేసిన తర్వాత తలెత్తిన సమస్యను.. ఏ విధంగా అధిగమించనుంది? పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీల వైఖరి ఎలా ఉండబోతుంది? తెలంగాణ నీటివాటా కోసం పార్లమెంట్‌లో ఫైట్ కృష్ణా.. గోదావరి రివర్‌బోర్డు మేనేజ్‌మెంట్ పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తున్నందున.. ఈలోపే…
ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి… పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారని ఆరోపించిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారు… ఇక, వారి ఆటలు సాగవన్న ఆయన.. సీఎం…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జల వివాదంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పవన్.. ఇద్దరు…
తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి…