జల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీంతో.. ఇవాళ 6 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా…
కృష్ణానదీ జలాలపై ఎపి తెలంగాణ మధ్య ముదిరిన వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు లేవు.మేమంటే మేమే సరైన విధానంతో వున్నామని ఉభయ రాష్ట్రాలూ గట్టిగా వాదిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత వ్యవస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాగూ ఇలాటి వివాదాలను వెంటనే పరిష్కరించేతొందరలోలేదుగనక నీళ్లునిప్పులై మండటం అనివార్యం. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఆరోపణలుచేసేవారే మళ్లీ అవతలివారిని గట్టిగా ఖండిరచలేదని తప్పుపడుతున్నారు. మొత్తంపైన ఈవివాదంలో రాజకీయాలు వున్నా నీటికి సంబం ధించినపూర్తి భిన్నాభిప్రాయాలు అవాస్తవం కాదు.…
జల జగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన…
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన కొత్త పీసీసీ కమిటీకి అభినందనలు తెలిపారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా ఉండకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. ధీర్ఘకాలం పాటు తనకు పీసీసీ చీఫ్ గా పనిచేసే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని.. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. పోలీసుల వేధింపులను తట్టుకొని నిలబడ్డ కార్యకర్తలకు సెల్యూట్ అని ఆయన చెప్పారు.…
అమరావతి : కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ లకు వేర్వేరుగా సీఎం జగన్ లేఖలు రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తామని కృష్ణా బోర్డు తరచు అడగటాన్ని తప్పుబట్టారు సీఎం జగన్. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ఏపీ చేసిన అభ్యర్థనను కేఆర్ఎమ్బీ పట్టించుకోవటం లేదని లేఖలో ఆక్షేపించిన సీఎం జగన్… తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాతే… రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు ఈనాటిది కాదు.. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య ఈ వ్యవహారంలో డైలాగ్ వార్ నడుస్తోంది… దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంలపై మండిపడ్డారు.. కృష్ణా జలాల వివాదాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి పోయారని.. వ్యవస్థలను…
కృష్ణా జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా… ఈ వ్యహారంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… తెలంగాణపై మండిపడ్డారు.. ఏపీకి నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు అవలంభిస్తోందన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్టు తెలిపారు.. దీనిపై రేపు కర్నూలు వేదికగా.. రాయలసీమ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. మరోవైపు.. రాష్ట్రంలో జగనన్న ఇళ్లు అర్జెంటుగా కట్టేయాలంటూ లబ్ధిదారను ఇబ్బంది…
జల జగడం రోజురోజుకీ తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల మధ్య మాటల దాడిని పెంచుతోంది.. తాజాగా.. ఈ వ్యవహారంలో స్పందించిన తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తేలేదు.. ప్రాణాలు పోయినా పోరాడుతామని వ్యాఖ్యానించారు.. తెలంగాణకు ఎవరు నష్టం చేసినా పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన ఆయన.. తెలంగాణ నీళ్లను ఎవరు దోసుకపోయినా అడ్డం నిలబడాలని.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కించపరిచేలా మాట్లాడినా అందరం ఏకతాటిపైకి…
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర విభజనే మనకు పెద్ద నష్టం అన్నారు.. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే నేటికీ ఇబ్బంది పడుతున్నామన్న ఆయన.. విభజన చట్టంలో ఉన్న నియమనిబంధనలకే మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.. తెలంగాణ నేతలకు కూడా మేం అదే చెబుతున్నాం.. జలవివాదాలను…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది… రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించన కేబినెట్.. ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన తెలంగాణ-ఏపీ జల వివాదంపై చర్చించింది… తెలంగాణలో ఏపీ ప్రజలున్నారు.. వాళ్లకు ఇబ్బంది కలగకూడదనే సంయమనంతో ఉన్నామని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారన్న సీఎం.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.. ఇక,…