అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డితో వివాహమైంది. రెండు కుటుంబాలు వనపర్తిలో నివసిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని పెళ్లి వేడుకలో లక్ష్మి ఫోటో తీయకపోవడంతో తిండి మానేసింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి.