Balagam Movie: అలిగిన ఆడబిడ్డను కుటుంబంతో కలిపిన ‘బలగం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brothers get together after watching balagam movie: దశాబ్దాల తర్వాత కుటుంబ సభ్యులు కలిసి చూసే సినిమా వచ్చింది. అందుకే పంచాయతీ ఆఫీసులో, ఊరి నడిబొడ్డున సినిమాలను ప్రదర్శిస్తున్నారు. మరి కొందరు సర్పంచులు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపిస్తున్నారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలం ఇంటిల్లిపాదీ అలరిస్తోంది. బంధాలను పంచుకునే ఈ చిత్రం విడిపోయిన కుటుంబాలను ఒకచోట చేర్చింది. బలగం సినిమా కుటుంబ సంబంధాలపై బలమైన ప్రభావం చూపుతుంది. విడిపోయిన కుటుంబాలు కలుస్తున్నాయి.. కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. మండల పరిధి వనపర్తిలో ఇటీవల ప్రదర్శింపబడిన ‘బలగం’ చిత్రం విడిపోయిన అక్కా, తమ్ముళ్ల కుటుంబాలను కలిచివేసింది.
అసలు ఏం జరిగింది..
Also Read
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
- Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
- Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డితో వివాహమైంది. రెండు కుటుంబాలు వనపర్తిలో నివసిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని పెళ్లి వేడుకలో లక్ష్మి ఫోటో తీయకపోవడంతో తిండి మానేసింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి. ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త వీరారెడ్డి చనిపోయాడు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో లింగారెడ్డి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో భార్య వసంత, కుమారుడు శ్రీకాంత్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్లారు. అయినా కూడా ఇరు కుటుంబాల మధ్య సఖ్యత లేదు. ఇటీవల సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో బలం చిత్రం ప్రదర్శించారు. ఆ సినిమా చూసి లింగారెడ్డి, లక్ష్మిల గుండెలు మారిపోయాయి. లింగారెడ్డి తన అక్క లక్ష్మి ఇంటికి ఈ నెల 15న సర్పంచ్ శ్రీధర్, గ్రామస్తులు మహేష్, రవీందర్ రెడ్డి సమక్షంలో వెళ్లాడు. ఇద్దరి కుటుంబాలు కలిసి మాట్లాడుతూ ఒకరొనొకరు కన్నీరుమున్నీరయ్యారు. ఇన్ని సంవత్సరాలు కళ్లముందే వున్నా పలకరించుకోలేని వీరు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకుంటూ సరదాగా గడపారు. వీరిద్దరి కుటుంబాలు కలవడంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు.
Jagga Reddy: జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు.. రేవంత్ కు దక్కని ఆహ్వానం
తాజావార్తలు
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..