వాహనదారులు తమ వాహనాలకు విధిగా నెంబర్ ప్లేట్స్ వాడి నేరాల నియంత్రణకు సహకరించాలని రాచకొండ జాయింట్ సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. పోలీసుల తనిఖీల్లో తరచూగా పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీతో దురుసుగా ప్రవర్తించారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని.. ఇలా అయితే స్పందన కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ కలెక్టర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కలెక్టర్ ముందు పేపర్లు విసిరేసి బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా పనికిరావంటూ దుర్భాషలాడారు. జిల్లా కలెక్టర్ తనను బయటకు…
Warning to Drinkers: 2016లో బీహార్ ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించింది. ఈ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, విక్రయించడం, సేవించటం నేరం. ఈ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులను హెచ్చరిస్తూ వారి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ బీహార్‌లో మాత్రం తాగుబోతులు…
అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. మొదటిసారి వర్క్‌షాపుతో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుందన్నారు. కానీ అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నానని.. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవని.. షాట్‌కర్ట్స్‌కు మనం తావిస్తే ఆ పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని… ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.…
CM Jagan Mohan Reddy: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ం అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం జగన్ స్వయంగా సమీక్షించారు. అయితే గడప గడపకు కార్యక్రమం విషయంలో పలువురు ఎమ్మెల్యేలు వెనుకబడటంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 27 మంది ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. 27 మంది పేర్లతో…
MLA Kethireddy: అనంతపురం జిల్లా ధర్మపురం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వాయిస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన నియోజకవర్గంలోని పలు వార్డుల్లో వాలంటీర్లు పెన్షన్ సొమ్ము ఇవ్వడంలో కరప్షన్‌కు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వార్డుల్లో వాలంటీర్ల ద్వారా కరప్షన్ చేయమని చెప్పేసి, చేస్తున్నారని.. ఎవడైనా జనం దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిస్తే ఒక్కొక్కడిని…
Infosys: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అయితే ఇటీవల కరోనా కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కూడా రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని…
Apple Warning: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో భద్రతాపరమైన లోపాలు తలెత్తవచ్చని టెక్ దిగ్గజం యాపిల్ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఈ పరికరాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాల అంశంపై వచ్చిన నివేదికపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు భద్రతా లోపాలపై యాపిల్ రెండు నివేదికలను విడుదల చేసింది. సఫారీతో పాటు యాపిల్ బ్రౌజర్…