Apple Warning: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో భద్రతాపరమైన లోపాలు తలెత్తవచ్చని టెక్ దిగ్గజం యాపిల్ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఈ పరికరాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాల అంశంపై వచ్చిన నివేదికపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు భద్రతా లోపాలపై యాపిల్ రెండు నివేదికలను విడుదల చేసింది. సఫారీతో పాటు యాపిల్ బ్రౌజర్ వెబ్‌కిట్‌లో రెండు బగ్‌లు ఉన్నట్లు యాపిల్ నివేదించింది.
Read Also: Reliance Jio plans: కొత్త ప్లాన్స్ తెచ్చిన జియో.. రోజుకి 2 జీబీ డేటా, ఓటీటీ ఆఫర్లు సహా మరిన్ని..!
కాగా భద్రతా ముప్పు ఉన్న ఐఫోన్ 6ఎస్, ఆ తర్వాతి మోడళ్లు, అన్ని ఐప్యాడ్ ప్రో మోడళ్లు, ఐప్యాడ్ ఎయిర్ 2, మ్యాక్ ఓఎస్ మాంటెరీపై నడుస్తున్న మ్యాక్ కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వివరణ ప్రకారం ఈ పరికరాలపై హ్యాకర్లు పూర్తి పట్టు చేపట్టే ప్రమాదం ఉందని.. వారికి నచ్చినట్లు సాఫ్ట్‌వేర్‌ను యాక్సిస్ చేసే అవకాశం ఉందని సోషల్ ప్రూఫ్ సెక్యూరిటీ సీఈవో రాచెల్ టొబాక్ వెల్లడించారు. అటు అన్ని డివైస్‌లలో ప్యాచ్డ్ వెర్షన్ అందుబాటులో ఉంటుందని యాపిల్ తెలిపింది. ఈ మేరకు ఐవోఎస్ 15.6.1, మ్యాక్ ఓఎస్ మాంటెరీ 12.5.1, ఐప్యాడ్ ఓఎస్ 15.6.1 అప్ డేట్స్ భారత్ లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే ఎక్కడ, ఎవరి ద్వారా లోపాలను గుర్తించిందన్న విషయంపై యాపిల్ స్పష్టత ఇవ్వలేదు.