ఈ రోజు GHMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన అంశంపై చర్చ కొనసాగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల విలీనం చేసిన 27 మునిసిపాలిటీలతో పాటు, ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వరకు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పోరేటర్లు మరియు నగరవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చర్చల సమయంలో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దారుస్సలంలో వార్డుల విభజన జరిగిందంటూ బీజేపీ కార్పోరేటర్లు…