Medico Preethi Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో స్ప ష్టత వచ్చింది. ప్రీతి . మృతికి గల కారణాలపైనా పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆమెది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా 306గా ఈ కేసును నిర్ధారించామని పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. వరంగల్ సీపీనీ కలిసిన మెడికో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ కలిశారు. మెడికో ప్రీతి ఆత్మహత్యగా పోలీసులు ప్రకటించడంతో సీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రీతి తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడారు. సీపీతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని ఆయన చెప్పారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామన్నారు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారని.. కానీ రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని.. ఛార్జ్‌షీట్‌లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నామని ప్రీతి తండ్రి నరేందర్ అనుమానం వ్యక్తం చేశారు.
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఫిబ్రవరి 22న ఎంజీఎంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి వైద్యులు గమనించి వెంటనే చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి మరింత విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆమె ట్రీట్‌మెంట్ పొందుతూ 26న చనిపోయింది. తన కూతురిని సీనియర్ స్టూడెంట్ సైఫ్ అనే అతను వేధించాడని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిం చారు. తన కూతురు మానసికంగా వేధింపులు భరించలేక చనిపోయింది అంటూ ఆరోపించారు. హత్యచేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును పరిశోధన చేశారు.
Read Also: Amit Shah: బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు వదులుకుంటుంది?
అయితే ప్రీతి నిమ్స్‌లో ట్రీట్‌మెం ట్ పొందుతున్న సమయంలో రెండ్రోజుల పాటు కేఎంసీ, ఎంజీఎంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రీతి రూమ్‌లో హానికారక ఇంజక్షన్ లభించిందని.. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె సక్సీనైల్ కోలిన్ అనే ఇంజక్షన్ వివరాలను గూగుల్‌లో వెతికిందన్న పోలీసులు.. సైఫ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని భావించారు. అతణ్ని అరెస్టు చేసి మరిన్ని వివరాలు సేకరించారు. టాక్సీకాలజీ రిపోర్టు కోసం బ్లడ్ శాంపిల్స్ తీసి పంపారు. అయితే ఈ టాక్సీకాలజీ రిపోర్టులో ఎలాంటి విషతుల్య పదార్ధాలు బయటపడలేదు. మార్చి 5న వచ్చిన టాక్సీకాలజీ రిపోర్టులో ప్రీతి రక్తం , అవయవాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని తేలింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు మరోసారి ఎంజీఎం బాట పట్టారు. సీపీ రంగనాథ్ స్వయంగా వెళ్లి అక్కడి డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందితో విచారణ జరిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు కోసం వేచి చూశారు. ప్రీతి చనిపోయిన నెల రోజుల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు చేరింది. ఈ రిపోర్టులోనూ ప్రీతి మృతికి సం బంధించి క్లారిటికి వచ్చా రు. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)తో పాటు హిస్టోపాథాలజీ రిపోర్టు ఫైనల్ ఒపీనియన్‌లో ప్రీతి డెడ్ బాడీలో విష పదార్థాలు ఉన్నట్లు వచ్చింది. దీంతో ప్రీతిది ఆత్మహత్యగా నిర్ధారించారు.