కాకతీయ విశ్వవిద్యాలయంలో గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.. ఏబీవీపీ విద్యార్థులు 4న డోర్ పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారు అని సీపీ తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ అయ్యారు.. ఆయన స్థానంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగనాథ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వ నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ ఎందుకు జరిగింది. కేవలం ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రమే బదిలీ…