YS Sharmila: తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై స్పందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైఎస్ షర్మిల పాదయాత్ర వల్ల నర్సంపేటలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, పాదయాత్రకు అనుమతి ఎందుకు నిలుపుదల చేయకూడదో ఆమె వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కారణంగా నర్సంపేటలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, ఎందుకు పాదయాత్రకు అనుమతి నిరాకరించకూడదో చెప్పాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Read Also: Minister KTR : చెరువు మాయమైందంటూ మంత్రికి ట్వీట్.. అక్కడికెళ్లి చూసి అవాక్కైన అధికారులు
నేడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సీపీ రంగనాథ్ ను వైయస్ఆర్ తెలంగాణ పార్టీ లీగల్ టీం సభ్యులు కలిశారు. వైయస్ షర్మిల పాదయాత్ర కు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలని సీపీ రంగనాథ్ కు తెలిపి సీపీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చారు. ఈ వార్తలపై స్పందించి వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరగా.. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రెండు రోజుల గడువు కోరారు.