రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం రక్తికడుతూ వుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న చేసిన కామెంట్లు మంటలు రాజేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం రచ్చబండలో చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అది కూడా ప్రొఫెసర్ జయశంకర్ సొంతూళ్ళు మాట్లాడడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. రెడ్లకు పగ్గాలివ్వాలంటూ వివిధ రాజకీయ పార్టీలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్న.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే…
వారిద్దరూ మిత్రులు కాదు. అలా అని శత్రువులు కారు. ఒకరు అధికారపార్టీ అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే. ఇంకొకరు టీడీపీ నేత. అకస్మాతుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దెప్పిపొడుపు మాటలతో తమలోని కళను బయటపెడుతున్నారు. ఆ గిల్లికజ్జాల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషణతూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా వాడీవేడిగా మారిపోయాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది.…
ఏపీలో వైసీపీ నేతలు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రంజుగా సాగుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే గణేష్. నిరంతరం ప్రభుత్వం మీద ఏదోవిధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత అయ్యన్నకు లేదన్నారు. విలేఖర్లకు పంపిన వీడియోలో టీడీపీ నేతలపై ఎమ్మెల్యే గణేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు కేవలం రూ. 12 కోట్లు మీరు బిల్లులు చేస్తే, మా ప్రభుత్వంలో…
విశాఖ జిల్లా వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కన్నబాబు రాజుల మధ్మ మాటల యుద్ధం నడిచింది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి అవంతి, ఎమ్మెల్యే కన్నబాబు మధ్య మాటకు మాట చోటుచేసుకుంది. వేదికపైకి ZP వైస్ ఛైర్మన్ లను స్వాగతించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రొటోకాల్ లో అలాంటి స౦ప్రదాయ౦ లేద౦టూ అభ్య౦తర౦ తెలిపారు MLA కన్నబాబు రాజు. తాను మాట్లాడిన తర్వాత అభ్య౦తర౦ ఉంటే మాట్లాడాలన్నారు మంత్రి. ప్రొటోకాల్…
బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని…
మనల్ని పాలించే నేతలు ఎలా వుండాలి? వారి ప్రవర్తన ఎలా వుండాలి? అనేదానిపై ప్రజలు ఆలోచించాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడలో విద్యార్థులతో ముఖాముఖి లో వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను ఎన్నుకునే ముందు కులం మతం చూసి ఎన్నుకోకూడదన్నారు. నేతల కులం కన్నా గుణం మిన్న అన్నారు వెంకయ్యనాయుడు. మంచి వారిని సేవా భావం ఉన్న వారిని ప్రోత్సహించాలి నాయకుడిగా ఎన్నుకోవాలి. పార్లమెంట్ కి అసెంబ్లీకి పోయి మాట్లాడేటప్పుడు సభ్యతతో సంస్కారంతో…
ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ-టీడీపీ నేతల మాటల మంటలు కొనసాగుతూనే వున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళేది టీడీపీని బీజేపీలోకి కలపడానికే అన్నారు. పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వుంటే బాగుండేదని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. పట్టాభిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు దీక్ష చేసి ఉంటే బాగుండేదన్నారు. చంద్రబాబు దీక్ష వేదిక నుండి ఏం మాట్లాడారో అందరం చూశామని, దీక్ష ముగిసే లోపు చంద్రబాబు..…