Waqf Board: కర్ణాటకలో వక్ఫ్ బోర్డు తీరు వివాదాస్పదంగా మారింది. విజయపుర జిల్లాలోని రైతుల భూమి తమదే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హోన్వాడ గ్రామంలోని రైతులకు మాట్లాడుతూ.. తమ పూర్వీకులు భూమిలో 1500 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు రీ అసైన్డ్ చేస్తున్నట్లు అక్టోబర్ 04న తహసీల్దార్ నుంచి లేఖ అందినట్లు తెలిపారు.
Badruddin Ajmal: దేశవ్యాప్తంగా వక్ఫ్ (సవరణ) బిల్లు చర్చనీయాంశంగా మారిన వేళ అస్సాంకు చెందిన ఎంపీ బద్రుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం, దాని పరిసరాల్లోని ప్రాంతాలు వక్ఫ్ ఆస్తులే అని ఆయన కొత్త వివాదానికి తెరలేపారు.
Karnataka High Court: వివాహ ధృవీకరణ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు ‘‘వక్ఫ్ బోర్డు’’లకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై తాజాగా కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డులు మ్యారేజ్ సర్టిఫికేట్లు జారీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీలోని డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ భూమిలో రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది.
Waqf board: బీహార్ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ డాక్టర్ సంజయ్ జైశ్వాల్ వక్ఫ్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్ర సున్నీ వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపించిందని,
Himachal Pradesh : సిమ్లాలోని సంజౌలీలో మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం హిందూ సంస్థలు నిరసన తెలిపాయి. మసీదులో జరుగుతున్న అక్రమ నిర్మాణం 2007 నుండి వివాదాస్పదంగా ఉంది.
Uddhav Thackeray: కేంద ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ బిల్లుని కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించడంతో, ఈ బిల్లుని చర్చించేందుకు పార్లమెంట్‌లోని 31 మంది ఎంపీలతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు.
Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో చాలా ప్రమాదకరమైన సెక్షన్లు ఉన్నాయని గురువారం విరుచుకుపడ్డారు. ఇది చట్టం కాదని, వక్ఫ్‌ని నేలమట్టం చేసి, ముస్లింలను అంతం చేయడమే లక్ష్యమని ఆరోపించారు.
ప్రతిపక్షాల ఆందోళనకు కేంద్రం ఘాటుగానే బదులిచ్చింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, తమిళనాడులోని ఆలయం ఉదంతంతో పాటు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణలను ప్రస్తావించారు. వక్ఫ్ సంస్థల ద్వారా ఆక్రమణలని, అక్రమాలను సభలో చెప్పారు. ‘‘తమిళనాడులో తిరుచురాపల్లి జిల్లా ఉంది. అక్కడ 1500 ఏళ్ల నాటి సుందరేశ్వర ఆలయం ఉంది.