Waqf bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్‌సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు బీజేపీ సీనియర్ మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.
అయితే, తాజాగా ఎంఐఎం నేత ఇమ్రాన్ సోలంకి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోల్‌కతాలోని క్రికెట్ స్టేడియం ‘‘ఈడెన్ గార్డెన్’’ కూడా వక్ఫ్ ఆస్తి అని క్లెయిమ్ చేశారు. భారత సైన్య తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫోర్ట్ విలియ కూడా వక్ఫ్ ఆస్తి అని పేర్కొన్నారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో వక్ఫ్‌కు 105 ఆస్తులు ఉన్నట్లు ఇమ్రాన్ చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుపై జెపిసి నివేదికను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల కేసుల గురించి కూడా లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించిన జెపిసి నివేదిక వివరణాత్మక వివరాలను అందిస్తుంది.
CM Yogi: భారతదేశంలో అనేక దేవాలయాలు- మసీదుల వివాదాల పునరుద్ధరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..వారసత్వాన్ని తిరిగి పొందడం చెడ్డ విషయం కాదు... ఇప్పుడు సంభాల్‌లోని షాహీ జామా మసీదులో సనాతన్ రుజువు కనిపిస్తుంది అన్నారు.
Varanasi: వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్‌లో మసీదు వివాదానికి ఆజ్యం పోసింది. మసీదును తొలగించాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఈ స్థలాన్ని క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో నిరసన ప్రదర్శన జరిగింది.
Karnataka: కర్ణాటక విశ్వ వొక్కలిగ మహాసంస్తాన మఠం స్వామీజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని ఆయన పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది.
రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
Karnataka Land Issue: కర్ణాటకలోని విజయపుర జిల్లా హోన్వాడ గ్రామంలో 1,500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పూర్వీకుల భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ తహసీల్దార్ నుంచి రైతులకు నోటీసులు అందడంతో విషయం వేడెక్కింది. దింతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వరుస ఆరోపణలతో పాటు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ రైతుల హక్కులపై దాడి అని పేర్కొనగా, భూమిని లాక్కోదని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. Read Also: ISRO…