Badruddin Ajmal: పార్లమెంట్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వక్ఫ్ ఆస్తులే: ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్
- పార్లమెంట్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వక్ఫ్ ఆస్తులే..
- ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాక్యలు..
- వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badruddin Ajmal: దేశవ్యాప్తంగా వక్ఫ్ (సవరణ) బిల్లు చర్చనీయాంశంగా మారిన వేళ అస్సాంకు చెందిన ఎంపీ బద్రుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం, దాని పరిసరాల్లోని ప్రాంతాలు వక్ఫ్ ఆస్తులే అని ఆయన కొత్త వివాదానికి తెరలేపారు. అక్కడితో ఆగకుండా వక్ఫ్ బిల్లు కారణంగా ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ వసంత్ విహార్ చుట్టుపక్కల 50 విదేశీ దౌత్య కార్యాలయాలు ఉన్నాయని, ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా వక్ఫ్ ఆస్తిపైనే నిర్మించారని అన్నారు.
ఇదిలా ఉంటే, అజ్మల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. వక్ఫ్(సవరణ) బిల్లుకి అందరు ఎంపీలు మద్దతు తెలిపాలని కోరారు. పార్లమెంట్, మున్సిపల్ బిల్డింగ్స్, ఏయిర్ పోర్ట్స్, నగరాలు, గ్రామాలను రక్షణ అవసరం, ప్రపంచంలోనే అతిపెద్ద వక్ఫ్ ఆస్తులు ఇండియాలోనే ఉన్నాయని అన్నారు. వీటిని ముస్లిం కమ్యూనిటీలోని మహిళలు, పిల్లలు, వెనకబడిన వారి సంక్షేమానికి ఉపయోగించాలని ట్వీట్ చేశారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read Also: India – Canada Row : కెనడా, ఇండియా మధ్య గొడవేంటి..? ఖలిస్తాన్ కథేంది?
మీడియాలో మాట్లాడిన బద్రుద్దీన్ అజ్మల్.. ‘‘పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ ఆస్తిలో భాగమే. విమానాశ్రయం కూడా వక్ఫ్ భూమిలో నిర్మించబడింది. అనుమతి లేకుండా వక్ఫ్ భూమిని ఉపయోగించడం తప్పు. ఈ వక్ఫ్ బోర్డు సమస్యపై త్వరలో తమ ప్రభుత్వం పడిపోతుంది.’’ అని అన్నారు.
ప్రస్తుతం వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలను తొలగించాలని ఈ బిల్లుని తీసుకువచ్చారు. అయితే, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ ఇతర పార్టీలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది మతస్వేచ్ఛని ఉల్లంఘించడమే అని చెబుతున్నాయి. ఏదైనా ఆస్తి లేదా ప్రాంతాన్ని ‘‘వక్ఫ్ ఆస్తి’’గా పేర్కొనే వక్ఫ్ బోర్డుల అధికారాలను పరిమితం చేయడమే కేంద్రం లక్ష్యం.
We appeal to all MPs to support the Waqf Amendment Bill. Parliament & Municipal buildings, Airports, cities & villages need protection. India has largest Waqf properties in the world. We must use them for the welfare of women, children & backward groups within Muslim community. pic.twitter.com/ETLrmWb5uy
— Kiren Rijiju (@KirenRijiju) October 16, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!