తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రూమ్‌లో నిద్రపోయిన అతడు.. నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కొందరు అమెరికాలో చనిపోయారు. Also Read: Rohit vs Hardik: ఇద్దరి మధ్య ఇగో సమస్యలు…
దేశానికి దిక్సూచిలా తెలంగాణ పాలన, పథకాలు ఉన్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారు తెలంగాణ అభివృద్ది చూసి ఆశ్చర్యపోతున్నారని.. పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అడుగుతున్నారన్నారు.
దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరం.. ఇందులో ఎక్కువమొత్తం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పామని ఆయన చెప్పారు.
రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్.. రైతు భీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. పాలమూరు అంటే నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్.. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Off The Record: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వ్యవసాయ శాఖా మంత్రి ఇలాకా వనపర్తిలో రాజకీయ ముసలం పుట్టింది. అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరి పలువురు అధికారపార్టీ నాయకులు BRSకు గుడ్‌బై చెప్పి కండువా మార్చే పనిలో ఉన్నారు. ఏకంగా మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యవహార శైలిని విమర్శిస్తూ రాజీనామాలు ప్రకటించారు. వీళ్లంతా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి.. వనపర్తి ఎంపిపి కిచ్చారెడ్డిలతోపాటు పలువురు సర్పంచ్‌లు,…
OFF The Record: వనపర్తిలో కాంగ్రెస్ రాజకీయం రోడ్డున పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు పార్టీ నాయకులు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కే.. క్రమశిక్షణ లేదని ఆందోళనకు దిగారు. ఇంతకీ ఎందుకీ రచ్చ? వనపర్తి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి ఎర్త్ పెడుతుంది ఎవరు? చిన్నారెడ్డికి అంతకోపం ఎందుకు వచ్చింది? రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్నారెడ్డికి అసలేమైంది? వనపర్తిలో గడిచిన కొన్నిరోజులుగా సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డికి.. స్థానిక…
హైదరాబాద్ కాటేదాన్‌లో అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి.. చివరకు శవమై కనిపించింది… ఇంటి నుంచి వెళ్లిపోయిందనుకున్నారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటుంది అనుకున్నారు.. అంతేకాదు.. ఆమె మొబైల్ నుంచి.. ఆమె తండ్రికి వచ్చిన మెసేజ్‌లను బట్టి చూస్తే.. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కాదన్నావు.. అందుకే లేచిపోతున్నానంటూ సందేశాలు పంపారు.. దీంతో, ఆ యువతి ఎక్కడో ఉండే ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఆమె ప్రాణాలే తీశాడు.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా…
వనపర్తిలోని అమరచింత రెవెన్యూ అధికారుల మాయాజాలం బట్టబయలైంది. చనిపోయిన రైతు పొలంను అధికారులు ఇతరులకు పట్టా చేశారు. 43 ఏళ్ల క్రితం చనిపోయిన దేవుల బుచ్చన్న పేరుతో స్లాట్ బుక్ చేసి, ఆరు ఎకరాల భూమిని పట్టా చేసినట్టు తేలింది. ఇలా పట్టా మార్పిడి చేసినందుకు గాను అమరచింత తహశీల్దార్ భారీ మొత్తమో అందినట్టు బాధితుడు దేవుల వెంకటన్న ఆరోపణలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తహశీల్దార్ పట్టా మార్పిడి చేశారని.. అదేంటని ప్రశ్నిస్తే 43 ఏళ్ల క్రితం…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి కాంగ్రెస్‌లో వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకుని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. యువతతో కలిసి వనపర్తిలో శివసేనారెడ్డి కార్యక్రమాలు స్పీడ్ పెంచడంతో చిన్నారెడ్డి వర్గం కలవర పడుతోందట.చిన్నారెడ్డి మాజీ మంత్రి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్టీ తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వబోదనే ధీమాతో ఉన్నారు చిన్నారెడ్డి. దీంతో పాత, కొత్త…