విశాఖ పోలీస్ కమిషనరేట్ కు సమీపంలో కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిన ఆరడుగుల ఎత్తు 30 మీటర్ల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.. వినాయక మండపంతో పాటు సమీపంలోనే ఉన్న చిన్న చిన్న షాప్స్, బైక్ ల మీద పడడంతో ధ్వంసం అయ్యాయి.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శనివారం బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరవాసులు వేడి నుంచి కొంత ఉపశమనం పొందారు. అయితే.. వర్షం, బలమైన గాలుల కారణంగా నష్టం జరిగింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. నబీ కరీం ప్రాంతంలోని అర్కాన్షా రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రదేశం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో…
విశాఖ జిల్లా సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సింహాచలం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని విమర్శించారు.. ఆరు రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టి రెండు రోజుల కిందట పూర్తి చేశారు.. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా ? చందనోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు..
Mailardevpally Wall Collapse: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీఆర్ఆర్ టీం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి సీఐ మధు సహా చిన్నారుల తల్లిదండ్రులు స్పందించారు. ఎన్టీవీతో డీఆర్ఆర్…
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈదురుగాలుల బీభత్సానికి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో గోడ మీద పడటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. రెండు గంటలుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఓ వైపు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అశుభం చోటుచేసుకుంది. గురువారం నాడు ఈడెన్ గార్డెన్ స్టేడియం బయటి గోడలో కొంత భాగం కూలిపోయింది. వీటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గోడ కూలిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఈ గోడ కూలిన సమాచారం అందించింది బాధితుడేనని తెలిసింది.