దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025.. ఆగస్ట్ 20 నుంచి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
Election commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 1వ తేదీ నాటికి ఓటర్లుగా అర్హులయ్యే వారి పేర్లను జాబితాలో చేర్చేలా సవరణ ప్రక్రియ చేపట్టనున్న ఈసీ.. 2025 జనవరి 1వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటన కోసం ప్రక్రియను ప్రారంభించేలా ప్రకటన విడుదల చేసింది.
Telangana Young Voters: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18-19 ఏళ్ల మధ్య వయసు ఓటర్ల సంఖ్య లక్షా 36 వేల 496 మాత్రమే. అయితే ఈ సంఖ్య త్వరలోనే రికార్డు స్థాయిలో ఏకంగా ఎనిమిది రెట్లు పెరగనుంది. తద్వారా 10 లక్షల మార్కును చేరుకోనుంది.
ఏపీలో ఓటర్ల లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. పురుష ఓటర్లు 2 కోట్ల ఒక లక్ష 34 వేల 664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2 కోట్ల 5 లక్షల 97 వేల 544 మంది ఉన్నారు. దీంతో పురుషుల కంటే 4,62,880 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తం ఓటర్లలో 4,06,61,331 మంది సాధారణ ఓటర్లు, 7,033 మంది…
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన అప్లికేషన్‌లను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈమేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలియజేసింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉన్నట్లు కేంద్ర…
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 1న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.99 కోట్ల మంది, మహిళలు 2.4 కోట్ల మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4,041 మంది ట్రాన్స్ జెండర్లు, 67,090 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అయితే ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఏపీ వ్యాప్తంగా…