పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి సర్వం సిద్ధం అవుతోంది.. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది.. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా.. అందులో భాగంగా ఛైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం జరిపించడం ఒంటిమిట్ట ఆనవాయితీగా వస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కళ్యాణం కోసం ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.