Donald Trump: రక్షణ ఖర్చులను 50 శాతం తగ్గించుకోవాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. రక్షణ ఖర్చల్ని తగ్గించుకోవాలని అమెరికా రష్యా, చైనాలకు ప్రతిపాదన చేసింది. ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా,రష్యాల మధ్య ట్రంప్ రావడంతో స్నేహం చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది.
UN on Ukraine: అమెరికా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రతీ దశలో కూడా ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలిచింది, అందుకు తగ్గట్లుగానే ఓటింగ్‌లో పాల్గొంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు చిరకాల ప్రత్యర్థిగా భావించే రష్యాతో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్‌తో మాట్లాడారు.
UK PM Keir Starmer: రష్యాపై యుద్ధంలో కీవ్‌కు మద్దతు ఇవ్వడంలో యూకే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు భద్రతా పరంగా అండా ఉండటానికి యూరప్ దేశాలు రెడీ అవుతున్నాయి.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన కేవలం మూడు వారాల్లోనే తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే అమెరికా విదేశాంగ విధానానికి కొత్త మలుపు ఇవ్వడమే కాకుండా ప్రపంచ దౌత్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చూపించారు.
Tucker Carlson: ఫాక్స్ న్యూస్‌కి చెందిన మాజీ జర్నలిస్ట్ టక్కర్ కార్ల్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోబైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని చంపడానికి ప్రయత్నించిందని చెప్పారు. అయితే, టక్కర్ తన వాదనల్ని నిరూపించేలా ఎలాంటి ఆధారాల గురించి చెప్పలేదు. ‘‘ది టక్కర్ కార్ల్సన్ షో’’ తాజా ఎపిసోడ్లో కార్ల్సన్, అమెరికన్ రైటర్ అండ్ జర్నలిస్ట్ మాట్ తైబ్బితో సంభాషించారు.
వారికి శుభాకాంక్షలు తెలిపిన జగన్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలుగు వారు ఉన్నారు. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత…
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను కలవాలని అనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ ఇద్దరి మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని పలుమార్లు ట్రంప్ అన్నారు.
Zelensky: గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.
China–Russia: గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్ మోర్గులోవ్ వెల్లడించారు.
మాస్కో దాడుల నుంచి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యాడు. దీనిపై ఇప్పటికే రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు పంపినట్లు చెప్పారు.