ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వెస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బుధవారం రోజు విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. రేపు ఓ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి.. మరో వైపు మాజీ మంత్రి కూతురు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు.. రేపు విశాఖ వెళ్లనున్న ఆయన.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి…
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని…
ఫ్లాట్‌ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి గంటల తరబడి నరకం చూసింది ఓ విద్యార్థిని.. విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ.. దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ అభ్యసిస్తోంది.. రోజులాగే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ లో దువ్వాడ చేరుకున్న ఆమె.. స్టేషన్లో రన్నింగ్‌లో ఉన్న రైలు నుంచి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపోయింది.. ఊహించని ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన…
ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీకి చాలా కీలకం. రాజకీయ అవసరాల కోసమే కాదు భవిష్యత్ రాజధానిగా ఈ ప్రాంతంపై అంచనాలు ఎక్కువే. ఉత్తరాంధ్రను స్వీప్ చెయ్యడం ద్వారా తమ విధానాలకు ప్రజామోదం లభించిందనే బలమైన సంకేతాలు పంపించాలనేది అధికారపార్టీ ఆలోచన. వచ్చే ఏడాది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచి పాలన ప్రారంభం అవుతుందనే టాక్ ఉంది. ఇంతటి కీలక దశలో ఉమ్మడి విశాఖ జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడం వైసీపీకి అత్యవసరం. ఇదే విషయాన్ని పదేపదే అధిష్ఠానం చెబుతోంది. కానీ,…
విశాఖ సిటీ ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీసింది.. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఆటో రసీదులపై మతపరమైన ప్రచారం జరుగుతుండడం వివాదానికి దారి తీసింది.. చలాన రశీదుపై ఒక మత ప్రచారానికి సంబంధించిన కీర్తనలు, ఫోటో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. రైల్వేస్టేషన్ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గంలో ఓ ఆటో డ్రైవర్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఇందుకు గాను రూ.80 ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. అయితే, అనూహ్యంగా ఆ రశీదుపై…
వివాదాస్పద రుషికొండ నిర్మాణాలపై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టూరిజం ప్రాజెక్ట్ కోసం ఖరీదైన విల్లాలు తప్ప ప్రచారంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి నివాస భవనాల స్థాయిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. అయితే, పర్యావరణంకు జరుగుతున్న హాని మాత్రం క్షమించరానిది అన్న నారాయణ.. మంత్రులు, సలహాదారులపైన ఫైర్ అయ్యారు. అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా కోర్టు ఆదేశాలతో వస్తే తప్ప నిజాలు ప్రజలకు తెలియకుండా చూడడం సరైన విధానం కాదన్నారు.. ఆగస్టులో…
విశాఖను రాజధానిని చేస్తే టీటీడీ అధినేత చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణలో బిజినెస్‌లు చేస్తూ హైదరాబాద్‌లో ఉంటాడు.. మాకు విశాఖ రాజధాని వద్దంటారు అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో రైతుల భూ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకురావడంతోనే శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం తీసుకువచ్చామన్నారు.. కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరిగి ప్రజలు…