నగరి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి ఆర్ కె రోజా విశాఖ పర్యటనలో బిజీగా వున్నారు. ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. మంత్రి ఆర్కే రోజా మరోసారి డాన్స్ తో అదరగొట్టారు. ఆంధ్రా కాశ్మీర్ లంబ సింగి పర్యటనలో ఫోక్ డాక్స్ కు స్టెప్పులు వేశారు. కూలింగ్ గ్లా సెస్ పెట్టుకుని థింశా కళాకారుల తో కలిసి ఆడిపాడారు రోజా. మంత్రిగారి ఉత్సాహం చూసి పర్యాటకులు కేరింతలు కొట్టారు. అంతకు ముందు ఏపీ టూరిజం నిర్మించిన రిసార్ట్స్ ప్రారంభించారు మంత్రి. సుమారు మూడు కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూర్తయింది. ఆంధ్రా కాశ్మీర్ లంబ సింగిలో మంత్రి రోజా సందడి హాట్ టాపిక్ అవుతోంది. థింసా కళాకారులతో కలిసి నృత్యం చేశారు మంత్రి రోజా., ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. మంత్రి రోజా డ్యాన్స్ చేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.