Vizag Student Died: రైలు దిగుతూ జారిపడి… చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో తీవ్రంగా గాయపడి గంటకు పైగా శ్రమించి కాపాడిన విద్యార్దిని ప్రాణాలు దక్కలేదు. రైలు దిగుతూ జారి పడి ట్రైన్ – ప్లాట్ ఫాం మధ్య చిక్కుకుని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శశికళ మృతిచెందింది. నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోవడంతో అవయవాలు దెబ్బతిన్నాయి. అంతర్గత రక్త స్రావం కావడంతో నిన్నటి నుంచి హాస్పిటల్ లో అత్యవసర చికిత్స అందించారు. చివరి క్షణం వరకు పోరాడి మరణించింది శశికళ. ఫ్లాట్ ఫాం కు ట్రైన్ కు మధ్య ఇరుక్కుని బయటకు రాలేక ఆర్తనాదాలు చేసింది విద్యార్ధిని శశికళ.
దాదాపు గంటకు పైగా ట్రైన్ ను ఆపేసి ఫ్లాట్ ఫాంను తొలగించి రక్షించారు రైల్వే సిబ్బంది. అయినా శశికళ ప్రాణాలు దక్కకపోవడం విషాదం నింపింది. విశాఖలో ఫ్లాట్‌ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి గంటల తరబడి నరకం చూసింది ఆ విద్యార్థిని.. విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ.. దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ అభ్యసిస్తోంది.. రోజులాగే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ లో దువ్వాడ చేరుకున్న ఆమె.. స్టేషన్‌లో రన్నింగ్‌లో ఉన్న రైలు నుంచి దిగుతోంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపోయింది.. ఊహించని ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన ఆ యువతి గంటల తరబడి నరకం చూసింది.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
Uttarpradesh Bypolls: యూపీ ఉపఎన్నికల్లో ఎస్పీ కూటమిదే హవా.. డింపుల్ యాదవ్ నయా రికార్డ్..
ఇదిలా ఉంటే.. ఆమె బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.. రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు కూడా ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ విషయం రైల్వే స్టేషన్ సిబ్బందికి తెలిపారు ప్రయాణికులు. వెంటనే స్పందించిన రైల్వే రెస్క్యూ టీమ్.. విద్యార్థిని ఇరుక్కుపోయిన ప్రదేశంలో ప్లాట్‌ఫామ్‌ను బద్దలుకొట్టారు.. ఆ తర్వాత ఆమెను బయటకు తీశారు.. ఇలా దాదాపు రెండు గంటల పాటు ఆ విద్యార్ధిని నరకం చూసింది.. ఆమెను వెలికితీసిన తర్వాత ఆస్పత్రికి తరలించారు.. అయితే, ఆస్పత్రిలో వైద్యులు ఆమెను బతికించేందుకు ప్రయత్నించినా కుదరలేదు.
Read Also: Ram Gopal Varma: 400 మంది అమ్మాయిలతో సెక్స్ చేశా.. అందులో బాగా ఎవరు నచ్చారంటే..?
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!